ఫీల్డ్ ఆఫీసర్ నాగేశ్వరరావుకు ఘన సన్మానం

పయనించే సూర్యుడు జూన్ 04,(చింతకాని మండలం రిపోర్టర్.వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : చింతకాని కేంద్ర సహకార బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఊదారపు నాగేశ్వరరావు బదిలీపై మధిర బ్యాంకుకు వెళ్తున్న సందర్భంగా బ్యాంకు సిబ్బంది ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నాగేశ్వరరావు బ్యాంకు అభివృద్ధికి, ఖాతాదారులకు అందించిన సేవలను కొనియాడారు. ఆయన విధి నిర్వహణలో చూపిన నిబద్ధత, సేవాభావం ఆదర్శనీయమని ప్రశంసించారు. కొత్త బాధ్యతల్లో కూడా ఆయన మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ రీటా, సొసైటీ అధ్యక్షుడు నల్లమోతు శేషగిరిరావు, కార్యదర్శులు వై.శ్రీనివాసరావు, ఎం.శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ వంకాయలపాటి దీపిక, క్యాషియర్ జి. లావణ్య, సూపర్వైజర్ నాగార్జున, సిబ్బంది అసిస్టెంట్ ఎం. భవ్య, మెసెంజర్ పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *