200 ఫీట్ వరకు రోడ్డు విస్తరించే ప్రతిపాదనను రిటర్న్గా తీసుకోవాలని వినతిపత్రం సమర్పించిన గౌతమ్ గౌడ్

పయనించే సూర్యుడు, మే 29 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎ కుమార్ హఫీజ్‌పేట్ ఫ్లైఓవర్ రోడ్డు నుండి ఆల్విన్ కాలనీ చౌరస్తా వరకు రోడ్డు ను 80ఫీట్ నుండి 200ఫీట్ విస్తరించే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ తో పాటు హఫీ జ్‌పేట్ గ్రామస్థులు,యూత్ కాలనీ వాసు లు స్థానిక శాసనసభ్యులు, (పీఏ సి ) చైర్మన్ అరికెపూడి గాంధీని కలిసి వినతి పత్రం సమర్పించారు. రోడ్డు విస్తరణ వల్ల ఇళ్లు కోల్పోతున్న తమకు తీవ్ర అన్యాయం జరుగు తుందని, అధికారులు ప్రత్యామ్నా య మార్గాలు అన్వేషించాలని బాధితులు వేడుకున్నారు. బాధితుల వినతిపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. ఉన్నతాధికారులతో, ప్రభుత్వంతో మాట్లాడి ఈ ప్రతిపాదనను ఉపసం హరించుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే బాధితులకు నష్టం జరగకుండా తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచిస్తానని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *