పయనించే సూర్యుడు, మే 29 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ పవిత్ర బక్రీద్ పర్వదినం సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ఈద్గా వద్ద జరిగిన సామూహిక ప్రార్థనలో గౌరవ తాజా మాజీ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ముస్లిం సోదర, సోదరిమనులందరికీ బక్రీద్ పర్వదినం శుభాకాంక్షలు తెలియచేసిన పీఏసీ చైర్మన్ ఆరె కపూడి గాంధీ. ఈ సందర్బంగా పీఏసీ చైర్మన్ ఆరెక పూడి గాంధీ డమాట్లాడుతూ పవిత్ర బక్రీద్ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అని, అది దైవ భక్తికి, నిస్వార్థ త్యాగానికి నిదర్శనం అని, అల్లా పట్ల ప్రవక్త ఇబ్రహీం చూపిన అచంచలమైన విశ్వాసాన్ని స్మరించు కుంటూ ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారు అని,బక్రీద్ పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని, చాలా పవిత్రమైన పండుగ అని,మత సామరస్యానికి ప్రతీక అని ,త్యాగానికి ప్రతి రూపంగా నిలిచే ఈ పండుగ రోజున సమస్త మానవాళికి శాంతి చేకూరాలని అల్లాను ప్రార్థిస్తూ మత సామరస్యాన్ని ప్రతిభింభించేలా బక్రీద్ పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకో వాలని కోరుకుంటూ ముస్లిం సోదర సోదరీమణులందరికి బక్రీద్ పర్వదిన శుబాకాంక్షలు తెలియచే యడం జరిగి నది,బక్రీద్ చాలా పవిత్రమై న పండుగ అని మత సామరస్యానికి ప్రతీక అని, ముస్లిం సోదరులందరు పండుగను చక్కటి వాతావరణం లోకుటంబ సభ్యుల మధ్య ఆనందా యకంగా, సంతోషకరంగా జరుపు కోవాలని కోరడం జరిగినది.బక్రీదు పండుగను విజయవంతంగా,ఆనంద ముగా జరుపుకోవాలని సిఏసి చైర్మన్ గాంధీ తెలియచేసారు . ఈ కార్యక్రమంలో ముస్లిం మత పె ద్దలు, ముస్లిం సోదరులు,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.