పయనించే సూర్యుడు మే 5 రాజేష్ దౌల్తాబాద్) దౌల్తాబాద్ మండలంలోని గొడుగుపల్లి గ్రామానికి చెందిన కర్రే అంబయ్య (56) గత నెల 28 నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని గ్రామ సర్పంచ్ మద్దెల వనజ స్వామి, తెలిపారు. అంబయ్య ఆయన ఇంటి నుంచి వెళ్లిన అనంతరం తిరిగి రాకపోవడంతో బంధువులు, కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినప్పటికీ ఇంతవరకు అంబయ్య ఆచూకీ లభించలేదు.అంబయ్య ఎత్తు సుమారు 5.3 అడుగులు ఉంటాడు. అంబయ్య చామన ఛాయ రంగులో ఉంటారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటి నుంచి వెళ్లిన సమయంలో ఫోటోలో ఉన్న దుస్తులనే ధరించి ఉన్నారని పేర్కొన్నారు. ఆయన ఆచూకీ తెలిసిన వారు లేదా ఎక్కడైనా గుర్తించిన వారు వెంటనే 9959567270, 9949273504 నంబర్లకు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. అలాగే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు.