పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 5 వత్సవాయి మండలం, వేములనర్వ గ్రామంలో నిర్వహించిన సి.ఎస్.ఐ. చర్చి నూతన మందిర ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో జగ్గయ్యపేట శాసనసభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చి నిర్వాహకులు, విశ్వాసులు ఎమ్మెల్యే ఘన స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం నూతనంగా నిర్మించిన ప్రార్థనా మందిరాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే , ఈ పవిత్ర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన చర్చి పెద్దలను, నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మాట్లాడుతూ ప్రార్థనా మందిరాలు సమాజంలో శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం మరియు ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ప్రజలందరూ మత సామరస్యంతో జీవిస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వత్సవాయి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు,డీసీ కెనాల్ చైర్మన్ చిట్టూరి సుభాష్, జనార్ధన్, ఇనుపనూర్తి వీరయ్య, పెంటేల శ్రీనివాసరావు మరియు సీఎస్ఐ చర్చి పాస్టర్లు, సంఘ పెద్దలు, విశ్వాసులు, నాయకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.