పయనించే సూర్యుడు జూన్ 05 మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్ : జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు ప్రేమ్ రంగా గార్డెన్లో వార్డు సభను అత్యంత ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఎమ్ గిరీష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ‘స్వచ్ఛ జడ్చర్ల – స్వచ్ఛ వార్డు’ నినాదంతో పనిచేయాలన్నారు. ఇళ్ల వద్ద తడి, పొడి చెత్తను విడివిడిగా చేసి మున్సిపల్ ఆటోలకు అందించాలని కోరారు. రాబోయే వర్షాకాల దృష్ట్యా ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, తద్వారా దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఘన వ్యర్థాల నిర్వహణ, జల్ సంచయ్ – జల్ భగీధార్ కింద ఇంకుడు గుంతల నిర్మాణం, డ్రైనేజీల పూడికతీత, నిరంతర వీధిదీపాల నిర్వహణ,మొక్కల పెంపకం, తాగునీటి సరఫరా వంటి పలు అంశాల పైన చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్ సలాం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగేష్, వార్డు ఆఫీసర్లు , ఎమ్ అశ్విని , డి. కృష్ణయ్య, డాక్టర్ శ్వేత, ఆర్పీలు సరితా, స్వాతి, అంగన్వాడీ టీచర్లు శ్యామల, పెంటమ్మ, ఆశా వర్కర్ మంగమ్మలతో పాటు పుర ప్రముఖులు అనంత కిషన్, అశోక్ రెడ్డి, అశోక్, కండికృష్ణ, భరత్ సింహారెడ్డి, చంద్రమౌళి వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.