డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి.

పయనించే సూర్యుడు న్యూస్ యాడికి జూన్ 5 యాడికి మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ-2 సీతారామాంజనేయులు కి మధ్యాహ్న భోజన పథకం కార్మికులు మరియు సీఐటీయూ నాయకులు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తమ సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఉమా గౌడ్ మాట్లాడుతూ, డోక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని స్మార్ట్ కిచెన్ పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రభుత్వ ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లోనే వంట చేసి విద్యార్థులకు వేడి వేడి భోజనం అందించడం ద్వారా నాణ్యమైన, పోషకాహారం అందుతుందని, స్మార్ట్ కిచెన్ విధానం వల్ల ఆహార నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మెనూ ఛార్జీలను పెంచకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థికి మెనూ ఛార్జీలను రూ.20 పెంచాలని, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలను వెంటనే పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే 2019 నుండి కార్మికుల వేతనాల్లో ఎలాంటి పెంపు జరగలేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా గౌరవప్రదమైన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 5వ తేదీలోగా బిల్లులు, వేతనాలు చెల్లించాలని, వంటగదులు, మంచినీటి సౌకర్యాలు, నిల్వ గదులు మరియు ఇతర కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.

ప్రధాన డిమాండ్లు:

స్మార్ట్ కిచెన్ ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రతి విద్యార్థికి మెనూ ఛార్జీలను రూ.20 పెంచాలి. మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలను పెంచాలి. ప్రతి నెల 5వ తేదీలోగా బిల్లులు, వేతనాలు చెల్లించాలి. వంటగదులు, మంచినీటి సౌకర్యాలు, నిల్వ గదులు తదితర కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి. డోక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి ఈ కార్యక్రమంలో సీఐటీయూ యాడికి మండల కార్యదర్శి మహాలక్ష్మి, సీఐటీయూ గౌరవ అధ్యక్షులు షేక్ బషీర్ అహమ్మద్, సీఐటీయూ నాయకులు రాఘవ శ్రీనివాసులు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *