కూలి రేట్ల పెంపుకై డిమాండ్ నోటీస్! ఏఐటీయూసీ.

పయనించే సూర్యుడు జూన్ 6 ఆదోని రూరల్ రిపోర్టర ఆదోని పట్టణంలో వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ దుకాణాలలో మరియు గిడ్డంగులలో పనిచేస్తున్న హమాలి కార్మికులకు కూలీ రేట్లు పెంచవలసిందిగా ఏఐటియుసి అనుబంధ ఆదోని ఫర్టిలైజర్స్ మరియు పెస్టిసైడ్ దుకాణాలలో మరియు స్టాక్ పాయింట్లలో పనిచేస్తున్న కార్మిక సంఘం వారు ఆదోని అగ్రి ఇన్పుట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి డిమాండ్ నోటీసులు ఇవ్వడం జరిగింది, పెరుగుతున్న నిత్యవసర వస్తువులు ధరలు గ్యాస్ డీజీలు సిలిండర్ విద్యుత్ చార్జీలు విపరీతంగా పెరుగుతున్నందువల్ల తమ కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నయనిని కావున పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమ కూలి రేట్లు పెంచవలసిందిగా కోరుతూ గత రెండు సంవత్సరాల క్రితం చేసుకొన్న కూలీల ఒప్పందం ఈ నెలలో ముగుస్తున్నందువల్ల త్వరగా కార్మికుల కూలీ రేట్లు పెంచవలసిందిగా ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి ఓ .బి నాగరాజు పట్టణ ప్రధాన కార్యదర్శి వైటి భీమేష్ జిల్లా సమితి సభ్యులు బి ఎంకన్న, కల్లుబావి రాజు, సి. హుసేని. మేస్త్రి కృష్ణ, బాలాజీ బి. దేవా.నరసింహులు నాగరాజు .శీను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్రి ఇన్పుట్ యాజమాన్యం తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు ఎర్రి స్వామి. వీరేష్ లక్ష్మన్న. గార్లకు డిమాండ్ నోటీసు ఇచ్చి ఏడు రోజుల లోపు మా యొక్క డిమాండ్ నోటీసు పై చర్చించి మేము డిమాండ్ చేసిన గత కూలీరెట్లపై 30 శాతం అదనంగా ఇవ్వాలని తెలియజేసుకోవడం జరిగింది !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *