పచ్చదనమే భవిష్యత్తు.. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలితొగుట సిఐ లతీఫ్

."దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ నవరణలో మొక్కలు నాటుతున్న తొగుట సిఐ లతీఫ్, ఎస్ఐ అరుణ్ కుమార్ "

పయనించే సూర్యుడు మే 6 రాజేష్ దౌల్తాబాద్ ) దౌల్తాబాద్, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించాలని తొగుట సీఐ లతీఫ్, దౌల్తాబాద్ ఎస్సై అరుణ్‌కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం దౌల్తాబాద్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో వారు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీఐ లతీఫ్ మాట్లాడుతూ, పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని సూచించారు. మొక్కలు పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందిస్తాయని తెలిపారు. అనంతరం పోలీసు సిబ్బందితో కలిసి మొక్కలను నాటి వాటి సంరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *