అమ్మ పేరుతో – ఒక మొక్క

చెట్లని నాటుదాం- ప్రకృతిని కాపాడుదాం

పయనించే సూర్యుడు: జూన్ 6/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె. విజయ బాబు రాష్ట్ర అధ్యక్షులు నారపు రామచంద్రరావు , జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు , జిల్లా జనరల్ సెక్రటరీ నాయుడు రాఘవరావు ఆదేశాల మేరకు, మండల అధ్యక్షులు సాలి శివకృష్ణ సూచనలతో పోలింగ్ బూత్‌లలో “అమ్మ పేరుతో ఒక మొక్క” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మండల ప్రధాన కార్యదర్శి వేముల లక్ష్మీనారాయణ అధ్యక్షతన, భీమిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మరియు ఎస్కే సుభాని ఆధ్వర్యంలో, దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ 12 సంవత్సరాల విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని పోలింగ్ బూత్లలో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని నాయకులు పిలుపునిచ్చారు. “చెట్లు నాటుదాం – ప్రకృతిని కాపాడుదాం” అనే సందేశంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వందనాల భాస్కరరావు , మండల ఉపాధ్యక్షులు సాలి కృష్ణ, స్వామి, దేశ్‌రెడ్డి సంజీవరెడ్డి , పోతురాజు, దారావత్ రామారావు, మహిళలు, కార్యకర్తలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

.

ఇట్లు:


సాలి శివకృష్ణ సత్తుపల్లి బీజేపీ మండల అధ్యక్షులు వేముల లక్ష్మీనారాయణ మండల ప్రధాన కార్యదర్శి సత్తుపల్లి మండల శాఖ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *