శ్రీ లక్ష్మీ సుదర్శన యాగం ఆచరించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి దంపతులు

పయనించె సూర్యుడు దస్తగిరి రిపోర్టర్ న్యూస్ 6–6–2026 నారాయణఖేడ్ పట్టణంలోని ప్రముఖ వేద పండితులు మల్మంచి గురురాజ శర్మ నివాసంలో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న శ్రీ మహాతి జ్యోతిష్యాలయం శ్రీ లక్ష్మీ సుదర్శన మహాయాగంలో నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు శ్రీ మహారెడ్డి భూపాల్ రెడ్డి మరియు శ్రీమతి మహారెడ్డి జయశ్రీ భూపాల్ రెడ్డి * దంపతులు పాల్గొని యాగాన్ని ఆచరించారు. ఈ సందర్భంగా యాగశాలలో ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, రైతులు పంటలతో కళకళలాడాలని, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని వారు స్వామివారిని ప్రార్థించారు. యాగంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక హారతులు సమర్పించి, దేశ రాష్ట్రాల అభ్యున్నతి కోసం సంకల్పం చేశారు. ఈ మహాయాగం ద్వారా ప్రజల జీవితాల్లో శుభఫలితాలు కలగాలని ఆకాంక్షించారు. అనంతరం వేదపండితులు భూపాల్ రెడ్డి దంపతులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానిక ప్రముఖులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్మ పరిరక్షణే లక్ష్యం… ప్రజల సంక్షేమమే ధ్యేయం… అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని శ్రీ లక్ష్మీ సుదర్శన స్వామివారిని ప్రార్థించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి దంపతులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *