పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 6 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయస్థాయి మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ కు స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్ధులు ఎంపిక అయ్యారు. పాఠశాలలో 8వ తరగతి పూర్తి చేసిన ఆకుల వీరేన్ గంగా దుర్గ, బొల్లి మణిచందర్ రాజు లు జాతీయస్థాయిలో నిర్వహించిన ప్రవేశపరీక్షలో అత్యధిక మార్కులు సాధించి ఈ స్కాలర్ షిప్ కు ఎంపిక అయ్యారు.ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ శుక్రవారం తుది జాబితాను విడుదల చేసింది. ఈ ఇద్దరు విద్యార్ధులకు 9వ తరగతి నుండి పి.జిస్థాయి వరకు కేంద్రప్రభుత్వం నుండి సంవత్సరానికి 12 వేల రూపాయల ఉపకార వేతనం లభించనున్నది. ఇద్దరు విద్యార్ధులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హరిత, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్ధులకు అభినందనలు తెలిపారు.