చౌడేపల్లి లో మొక్కలు నాటిన అటవీ శాఖ అధికారులు

పయనించేసూర్యుడు మేజర్ న్యూస్ జూన్ 06.062026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 చౌడేపల్లి మండల పరిపాలన భవన ఆవరణలో అటవీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ. కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనిల్ కుమార్, బీట్ ఆఫీసర్లు పాల్గొని వివిధ రకాల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు మొక్కల పెంపకం అత్యంత అవసరమని తెలిపారు. ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని సూచించారు. అనంతరం ప్రజలకు మొక్కల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. పచ్చదనాన్ని పెంపొందించేందుకు కొంతమందికి సీడ్ బాల్స్ పంపిణీ చేసి వాటిని ఖాళీ ప్రదేశాల్లో చల్లాలని కోరారు. మొక్కలను నాటి వాటిని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *