నందివడ్డేమాన్ లో మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం…

పయనించే సూర్యుడు జూన్ 7, బిజినపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామంలో ఈరోజు ప్రజారోగ్యమే ధ్యేయంగా బాచుపల్లిలోని మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎంఏఎంఎస్) హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బృహత్తర ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు ఉచితంగా వైద్య సేవలు అందించనున్నారు. ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్ (సాధారణ వైద్యం), జనరల్ సర్జరీ (శస్త్రచికిత్సలు), ఆప్తమాలజీ (కంటి వైద్యం), ఆర్థోపెడిక్స్ (ఎముకలు, కీళ్ల వైద్యం), గైనకాలజీ (మహిళల ఆరోగ్య వైద్యం) విభాగాలకు చెందిన వైద్యులు సేవలు అందించనున్నారు. శిబిరానికి హాజరయ్యే రోగులకు ఉచిత మందులు, రక్త పరీక్షలు, ఈసీజీ (ఎలక్ట్రో కార్డియోగ్రామ్) పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్లు కూడా చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే గర్భిణీ స్త్రీలకు ఉచిత కాన్పుల కోసం ప్రత్యేక కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ కార్డుతో హాస్పిటల్‌కు వచ్చిన వారికి స్కానింగ్, మందులు, కాన్పు సేవలు పూర్తిగా ఉచితంగా అందించడంతో పాటు మమత డెలివరీ కిట్‌ను కూడా ఉచితంగా అందజేయనున్నట్లు హాస్పిటల్ యాజమాన్యం వెల్లడించింది. కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *