రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయంవర్థంతి సభలో

పయనించే సూర్యుడు న్యూస్ :మే :22:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :మానకొండూర్ నియోజకవర్గం డాక్టర్ కవ్వంపల్లి దేశ అభివృద్ధి, సాంకేతిక రంగ పురోగతి,యువత సాధికారత కోసం దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిరస్మరణీయమైన సేవలు అందించారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కొనియాడారు. గురువారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో జరిగిన రాజీవ్ గాంధీ 35వ వర్థంతి వేడుకల్లో ఆయన ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రధానిగా రాజీవ్ గాంధీ వివిధ రంగాల్లో అందించిన సేవలు భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు.భారత దేశాన్ని ఆధునికత వైపు నడిపించిన రాజీవ్ గాంధీ మహా మేథావి అని, ఇందుకు ఆయన దూరదృష్టి కారణమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా శాస్త్ర, సాంకేతిక, సమాచార రంగాల అభివృద్ధికి ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశ ప్రగతికి బలమైన పునాదులు వేశాయని ఆయన పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకు అందరం కృషి చేయాలని, ఆయన ఆశయాలను స్మరించుకుంటూ, దేశాభివృద్ధికి కట్టుబడి పని చేయాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *