గోనెగండ్ల జీనియస్ గ్లోబల్ పాఠశాల పై చర్యలు తీసుకోవాలి నాగరాజు

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 09,2026: గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ గోనెగండ్ల మండలం లోని జీనియస్ గ్లోబల్ పాఠశాల పై చర్యలు తీసుకోవాలనీ రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కి వినతి, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పోతులపాడు నాగరాజు, జిల్లా కార్యదర్శి పండు మాట్లాడుతూ ఆ పాఠశాలలో సరైన మౌలిక వసతులు కల్పించకుండా, పిల్లల తల్లి తండ్రుల నుండి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ, పిల్లలకు ఆడుకోవడానికి ఆట స్థలం లేకుండా వున్నా చోటనే 8,9వ తరగతూ ల గధులను పెంచుతూ, పర్మిషన్ లేకుండా వల్ల ఇస్తానుసారంగా పాఠశాల నడుపుతున్నారని,అదేవిధంగా పాఠశాల ప్రక్కన పెట్రోల్ బంకు ఉండడంతో పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని లేదంటే ముందు ముందు పెద్ద ఎత్తున ఉద్యమిస్తాo, అని తెలిపారు.ఈ కార్యక్రమం లో వేణు రంగప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *