కోరుట్ల మున్సిపల్ కమిషనర్ గా వి. రాఘవేంద్ర పూర్తి బాధ్యతల స్వీకారం

శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ అధికారులు

పయనించే సూర్యుడు,( కోరుట్ల ) జూన్ 09 :- కోరుట్ల మున్సిపాలిటీలో నూతన మున్సిపల్ కమిషనర్ గా శ్రీ వి. రాఘవేంద్ర, సోమవారం రోజు పూర్తి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు.అనంతరం మున్సిపల్ మేనేజర్, డీఈ, ఇతర అధికారులు శ్రీ వి. రాఘవేంద్ర ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కోరుట్ల పట్టణ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవల అందజేయడం లో తమ వంతు సహకారం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా నూతన కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం, పారిశుధ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ మున్సిపాలిటీని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *