రెండవసారి ఆదోని కురువ సంఘం మండల అధ్యక్షులుగా

చాగి.మల్లికార్జున రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక

పయనించే సూర్యుడు జూన్ 9 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఈరోజు ఆదోని పట్టణం నందు కురువ కులస్తుల ఆరాధ్య దైవం అయినటువంటి భీరలింగేశ్వర దేవస్థాన కళ్యాణమండపం నందు ఆదోని మండలం ఆయా గ్రామాల నుంచి, మరియు పట్టణం నలుమూలల నుంచి వచ్చినటువంటి కురువ కులస్తుల, సమక్షంలో, రాష్ట్ర కురవ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, కురువ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఎస్ కే.మల్లికార్జున రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యుల సమక్షంలో రెండోసారి ఆదోని కురువ సంఘం మండల అధ్యక్షులుగా చాగి.కురవ మల్లికార్జున రెడ్డి,గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.తదానంతరం రాష్ట్ర అధ్యక్షులు, పూర్వ కార్పొరేషన్ చైర్ పర్సన్, నియామక పత్రాన్ని అందజేస్తూ రెండోసారి మండల అధ్యక్షులుగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. నన్ను రెండోసారి మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర కార్యవర్గానికి అలానే జిల్లా కార్యవర్గానికి ముఖ్యంగా కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప కి కృతజ్ఞతలు తెలుపుడం జరిగింది. ఈ కుల సంఘాల్లో పదవులు అలంకారం కాదని సమాజానికి తన వంతు సేవ చేసే భాగ్యమని చాగి.మలికార్జునరెడ్డి అన్నారు. నాపై నమ్మకం నుంచి రెండోసారి కురువ సంఘం మండల అధ్యక్షులుగా ఎన్నుకున్నటువంటి మా రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు నాయకుల నాపై ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయనని చాగి.మల్లికార్జున రెడ్డి అన్నారు. అలానే నూతనంగా ఆదోని నియోజకవర్గం అధ్యక్షులు కురువ రాఘవేంద్రను నియమించడం జరిగింది. జిల్లా కురువ సంఘం అధ్యక్షులుగా కురువ మల్లికార్జున వెంకన్నపేట వారిని నియమించి నియామక పత్రాలను అందజేయడం జరిగింది. క్రమంలో రాష్ట్ర జిల్లా కురవ సంఘాల నాయకులు కర్నూలు జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి మండలాల గ్రామాల కురవ సంఘం పెద్దలు నాయకులు అందరూ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *