ఆదోని నియోజకవర్గంలో ఎస్ ఐ ఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)

ముఖ్య అతిథిగాహాజరైన టిడిపి సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు.

పయనించే సూర్యుడు జూన్ 9 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఆదోని టిడిపి ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూల్ పార్లమెంట్ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా యువ నాయకులు సిద్ధార్థ నాయుడు క్లస్టర్లు, యూనిట్ సభ్యులకు వివరిస్తున్నారు. ఈ నెల 14వ తేదీ నుండి రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ ఐ ఆర్ కార్యక్రమంపై పార్టీ నాయకులు, క్లస్టర్ సభ్యులు, యూనిట్ సభ్యులు, అనుబంధ కమిటీ సభ్యులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆదోని పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ఎస్ ఐ ఆర్ పై వివరించారు తెలిపారు. ప్రతి గ్రామం, వార్డులో అర్హులైన ఓటర్ల పేర్లు ఓటరు జాబితాలో ఉండేలా ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయాలని నాయకులు సూచించారు. ఎస్ ఐ ఆర్ ద్వారా ఓటరు జాబితాలో ఉన్న లోపాలను సరిదిద్దే అవకాశం ఉంటుందని, మరణించిన వారి పేర్లు తొలగించడం, ఒకే వ్యక్తికి రెండు లేదా మూడు చోట్ల ఉన్న డూప్లికేట్ ఓట్లను తొలగించి ఒకే ఓటు ఉండేలా చర్యలు తీసుకుంటారని వివరించారు. అలాగే క్లస్టర్ ఇంచార్జీలు, యూనిట్ సభ్యులు, బూత్ కన్వీనర్లు చేపట్టాల్సిన కార్యక్రమాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. మరో రెండు మూడు రోజుల్లో బి ఎల్ ఏ లకు కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు.ఎస్ ఐ ఆర్ ప్రక్రియపై ఎలాంటి అపోహలు లేదా భయాలు అవసరం లేదని, ప్రజల ఓటు హక్కులను పరిరక్షించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన పారదర్శక ప్రక్రియ ఇదని నాయకులు కు వివరించారుకార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ సభ్యులు, పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, డైరెక్టర్లు, అనుబంధం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *