చింతూరు మండల అధ్యక్షులు మొహమ్మద్ జమాల్ ఖాన్ సమక్షంలో టీడీపీలో చేరిన 60 కుటుంబాలు

పయనించే సూర్యుడు ప్రతినిధి జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూన్ 7 పోలవరం జిల్లా చింతూరు మండలంలోయం,ఎల్,ఏ మిర్యాల శిరీష భాస్కర్ అధేనుషరం చింతూరు మండల పరిధిలోని కల్లేరు పంచాయతీ మధుగురు గ్రామంలో తెలుగుదేశం పార్టీలోకి భారీ వలసల చోటుచేసుకున్నాయి. చింతూరు మండల పార్టీ అధ్యక్షులు *మొహమ్మద్ జమాల్ ఖాన్ సమక్షంలో మధుగురు గ్రామానికి చెందిన సుమారు 60 కుటుంబాలు సీపీఎం పార్టీను వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా మధుగురు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో అధ్యక్షులు పార్టీలో చేరిన వారందరికీ టీడీపీ పసుపు కండువాలు కప్పిపార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మొహమ్మద్ జమాల్ ఖాన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై, పార్టీ సిద్ధాంతాలపై నమ్మకంతోనే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కుటుంబాలు పార్టీలో చేరడం సంతోషకరం. మండలంలో పార్టీ బలోపేతానికి, మధుగురు గ్రామ సమగ్ర అభివృద్ధికి కొత్తగా చేరిన వారందరితో కలిసికట్టుగా ముందుకు సాగుతాం. ప్రతి కార్యకర్తకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. అని ఆయన హామీ ఇచ్చారు.పార్టీలో చేరిన గ్రామస్థులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు, జమాల్ ఖాన్ నాయకత్వం పట్ల ఆకర్షితులమై తాము టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో చింతూరు మాజీ మండల అధ్యక్షులు జహంగీర్ మార్కెట్ కమిటీ సభ్యులు పసుపులేటి సల్మాన్ రాజు ,చింతూరు మండల మహిళా కార్యదర్శి పోడియం సావిత్రి, సత్తిబాబు,చింతూరు మాజీ సర్పంచ్ సోడే శ్రీను మరియు మధుగురు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *