ఐదవ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతాల్లో పెసా చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు

పయనించే సూర్యుడు ప్రతినిధి జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ జూన్ 7 పోలవరం జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామపంచాయతీ పరిధిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలన్న పెసా గ్రామసభ తీర్మానాలు మరియు గ్రామ పంచాయతీ అనుమతులు తప్పనిసరి అని ఎన్ని సందర్భాలలో చెప్పినప్పటికీ తీరు మార్చుకోకపోతే ఎంతటి వారైయన చట్టాల ముందు అందరూ సమానమే. చట్టి గ్రామంలో గ్రామ కంట భూములలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన గిరిజనేతరులు ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడంపై స్థానిక గ్రామపంచాయతీ కార్యదర్శి మహమ్మద్ అలీ కి గ్రామ పెసా కమిటీ సభ్యులు ఫిర్యాదు రూపంలో అక్రమ నిర్మా ణాలు చేపట్టే వారు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలకు బాధ్యులు కాగలరు తక్షణమే నిర్మాణాన్ని ఆపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే చట్టి కుంట రోడ్డు పక్కన ఎంపీయూపీ స్కూల్ ప్రహరీ గోడను ఆక్రమించుకొని కట్టిన షాపులు తొలగించాలని ది.05.01.2026న తెలియజేయడం జరిగింది. తక్షణమే అక్రమ దుకాణాలను తొలగించి చర్యలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెసా కమిటీ ఉపాధ్యక్షుడు తుర్రం. చిన్న ముత్తయ్య, కార్యదర్శి పోడియం. రామకృష్ణ గ్రామస్తులు రవ్వ. ప్రసాద్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *