రాజనాలబండపై సత్యప్రమాణాలుశనివారం పూజలు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూన్ 07 06.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలోని సత్యప్రమాణాలకు ప్రసిద్ధి చెందిన రాజనాలబండలో శనివారం భక్తులతో కిక్కిరిసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి, లక్ష్మీనరసింహస్వాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణమూర్తి ఆధ్వర్యం లో అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ పరిసరాల్లో భక్తులుకొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. పుంగనూరు మండలం నెక్కుంది గ్రామపంచాయతీ పరిధిలోని ఇటుక నెల్లూరు కి చెందిన వి శ్రీరాములు s/o గుర్రప్ప దొంగలించబడ్డ బావి మోటార్ తిరిగి లభించడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు తీర్చుకున్నారు. అలాగే అన్నమయ్య జిల్లా కలకడ మండలంవెనుగొండ పంచాయతీ గొల్లపల్లి గ్రామానికి చెందిన రెడ్డప్ప సన్నాఫ్ లక్ష్మన్న వీరు గత 20 రోజుల క్రితం టమాటా నారు దొంగలించబడింది అని సత్యప్రమాణాలలకు పేరుగాంచిన రాజనాలబండకు వచ్చి రసీదు కట్టి గ్రామ ప్రజలను ప్రమాణకానికి రావాలని కోరారు అయితే ఒక్కరోజు ముందుగానే రెడ్డప్ప పొలంలో టమోటా నారు తిరిగి లభ్యమయింది వారు కూడా రాజనాల బండ ఆంజనేయస్వామికి పూజలు నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేశారు స్వామి మహిమగా భావించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *