పయనించే సూర్యుడు జూన్ 7 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరు నియోజక వర్గ పరిధిలోని ఉపాధ్యాయులకు జరుగుతున్న ఎఫ్ ఎల్ ఎన్- 3 శిక్షణా కార్యక్రమం ను పరిశీలించిన జిల్లా సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోర్డినేటర్ వెంకటసుబ్బయ్య ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని ఉపాధ్యాయులకు ఫౌండేషన్ లీటరసీ అండ్ న్యూమరసి శిక్షణాకార్యక్రమాన్ని జిల్లా సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వెంకటసుబ్బయ్య సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1,2తరగతుల విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం కొత్తగా అనేక సంస్కరణలతో నూతన టెక్స్ట్ బుక్స్ వచ్చాయి. అదే విధంగా ఈ విద్యాసంవత్సరం రెడీనెస్ పాఠ్యపుస్తకాలు ప్రతి విద్యార్థికి సరఫరా చేస్తామని ఆగస్టు వరకు రెడీనెస్ కృత్యాలు చేయించాలని, విద్యార్థులకు సామర్ధ్యదారిత, ఆటపాటలతో, కృత్యధార భోదన మరియు దీక్ష ప్లాట్ ఫామ్ వంటివి డిజిటల్ భోధనలో ఉపయోగించాలని చేయాలని సూచించారు. అదే విధంగా ఈ విద్యాసంవత్సరం పాఠశాలల నమోదుకూడా పెరిగింది. ఇంకా ఉపాధ్యాయులు పెంచడానికి కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శిక్షణాకార్యక్రమం కోర్స్ డైరెక్టర్ అనంతలక్ష్మి , ఆత్మకూరు మండల ఎంఈఓ 2 చలపతి , మర్రిపాడు ఎంఈఓ-1 తిరుపతయ్య , మర్రిపాడు ఎంఈఓ-2 ధనలక్ష్మి అన్ని మండలాల డిఆర్పీలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.