జనం న్యూస్ ప్రతినిధి శ్రీరమణ జూన్ 07 తేదీ 2026 పీ.ఏ. పల్లి మండలం నల్గొండ జిల్లా న్యూస్. గుడిపల్లి మండలం లోని సింగరాజుపల్లి గ్రామములో గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ శ్రీనివాసులు సమక్షం లో ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ ఏర్పాటు జరిగింది. ఇందులో ప్రధానంగా పరిశుభ్రత అత్యంత ప్రాధాన్యత ఇస్తూ స్వచ్చభారత్ స్ఫూర్తి నీ గ్రామ సభలో పటిష్ఠంగా అమలు చేయడానికి చర్చించమని సర్పంచ్ శ్రీనివాసులు చెప్పాడు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపిడిఓ అండాలు, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.