నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ

జిల్లా కలెక్టర్ కె.హరిత.

జనం న్యూస్ 7 జూన్.కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. కె ఏలియా . ఆసిఫాబాద్ :జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ఉచిత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె.హరిత ఒక ప్రకటనలో తెలిపారు. జి ఎం ఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా జిల్లాలోని అర్హులైన నిరుద్యోగులకు హైదరాబాద్ లో 3 నెలల ప్రత్యేక ఉచిత నైపుణ్య శిక్షణ, ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. డ్రైవాల్ & ఫాల్స్ సీలింగ్ టెక్నీషియన్, వెల్డింగ్ & ఫ్యాబ్రికేషన్ టెక్నీషియన్, ఆటోమొబైల్స్ & టూవీలర్ టెక్నీషియన్, రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషన్ టెక్నీషియన్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, ఎక్స్కవేటర్ ఆపరేటర్, గెస్ట్ సర్వీస్ అసోసియేట్ (ఎఫ్ & బి), ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ (యువతులకు మాత్రమే) కోర్సులు అందించడం జరుగుతుందని, అభ్యర్థులు 3 ఆధార్ కార్డు ప్రతులు, రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటో, విద్యార్హత ధ్రువపత్రాలు కలిగి ఉండాలని తెలిపారు. జైనూర్, సిర్పూర్ – యు, లింగాపూర్ మండలాలకు చెందిన అభ్యర్థులకు జైనూర్ మండల కేంద్రంలోని కె.ఆర్.కె. ఫంక్షన్ హాల్ లో ఈ నేల 9వ తేదీ ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, కెరమెరి మండలానికి చెందిన అభ్యర్థులకు కెరమెరి మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఈ నెల 9వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు, తిర్యాణి మండలానికి చెందిన అభ్యర్థులకు తిర్యాణి మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఈ నెల 10వ తేదీన ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అర్హులైన నిరుద్యోగ యువతీ యువకుల నుండి దరఖాస్తుల స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగిందని, జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిచే జారీ చేయడమైనది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *