ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ అందరి బాధ్యత…

బడిబాట కార్యక్రమంలో ఇటిక్యాల సర్పంచ్ నీరటి శ్రీనివాస్

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జూన్ 08 మామిడిపెల్లి లక్ష్మణ్ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ అందరి బాధ్యత అని ఇటిక్యాల సర్పంచ్ నీరటి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం, ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేర్పును పెంచేందుకు ఉపాధ్యాయ బృందంతో కలిసి ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటిక్యాల గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను రక్షించుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులందరిదని అన్నారు. గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యలభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సీమలదారి సదాశివ్, వేల్పుల స్వామి యాదవ్, గాజెంగి రాజేశం, హన్మంతరావు, ఎద్దండి రమేష్ రెడ్డి, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *