బ్రాహ్మణ కుంటలో పడి ముగ్గురు చిన్నారులు దుర్మరణం

పయనించే సూర్యుడు, 9 జూన్ 2026, భీంగల్ మండల్ ప్రతినిధి కొత్వాల్ లింబాద్రి, నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలంలోని లింబాద్రిగుట్ట పరిధిలో గల వడ్డెర కాలనీ సమీపంలో గల బ్రాహ్మణ కుంటలో అక్రమంగా మొరం తవ్వకాలు జరిపి నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ లోతు తవ్వడంతో నీరు చేరి ముగ్గురు పసి ప్రాణాలు బలి తీసుకున్నది. ఇప్పటికైనా అధికారులు చొరవ చేసుకొని మొరం తవ్వకాలను కట్టుదిట్టం చేసి రక్షణ చర్యలు చేపట్టాలని వడ్డెర కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. నీట మునిగిన పిల్లలను వెతికి బయటకు తీసుకు వచ్చిన భీంగల్ గంగపుత్ర గజ ఈతగాళ్లు మీసాల నవీన్, డప్పు సాయి లను భీంగల్ ఎస్సై మరియు సీఐ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *