పాఠ్య పుస్తకాల పంపిణీ – ఎంఈఓ

పయనించే సూర్యుడు జూన్ 9 వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పెద్ద దగడ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 2026 -27 విద్య సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలను ప్రాథమిక పాఠశాలలకు అవసరమైన పుస్తకాలను ఎంఈఓ పంపిణీ చేశారు.ఎంఈఓ పీష్వా రాజేందర్రావు విద్యార్థుల గురించి మాట్లాడుతూ ఈ పుస్తకాలను అందుకుని విద్యార్థులు విద్యాభివృద్ధిలో ముందుకు సాగాలని కోరుచు తెలుగు.ఆంగ్లం.గణితం. పరిసరాల విజ్ఞానం. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలను అందజేశారు. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యా బోధన అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *