40 రోజులు కావస్తున్న హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించనిపోలీసులు

( పయనించే సూర్యుడు ) 7 జూన్ కొడంగల్ నియోజకవర్గ, కోడంగల్ మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం కోడంగల్ మండల అధ్యక్షులు బోయిని వెంకటయ్య అధ్యక్షతన శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు. తన కొడుకుని హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విజయమ్మ, అలాగే తన తమ్ముడు తలారి నర్సింలు పోలీస్ శాఖను కోరారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామానికి చెందిన తలారి హరిక్రిష్ణ ముదిరాజ్ సన్నాఫు టి. నర్సిములు 27 సం ల యువకుడు పోలం పని నిమిత్తమై 29-4-2026 తన గ్రామం జీవన్గి నుంచి రుద్రారం గ్రామానికి వచ్చి శవమై తేలాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు ఘటన స్థలానికి వచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించడం గాని, ఆదారాలు సేకరించడం గాని చేయలేదని తెలిపారు. పలు దాపాలుగా పోలిసులను ఆశ్రయించడం జరిగింది. కాని కేసు పురోగతి గురించి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. సంఘటన జారిగి దాదాపుగా 40 రోజులు కావస్తున్న కాని నిమ్మకు నీరెక్కినట్లు వారికి వ్యవహరిస్తున్నారు. నిందితులను గుర్తించే ప్రయత్నం చేయలేదు. నిందితులను కాపాడుతున్నట్లు అనిపిస్తుందని బాధితులు విచారం వ్యక్తం చేసారు. కాలుట్టి, బీసీ, ఎస్సీ , ఎస్టీ లపై జరుగుతున్న దాడులకు నిరసంగా అన్ని ప్రజాసంఘాల మద్దతుతో బాదితులకు తగు న్యాయం జరిగే విధంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమం లో ముదిరాజ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూర వెంకటయ్య ముదిరాజ్, తాండూర్ ముదిరాజ్ సంఘం నాయకులు రమేష్ ముదిరాజ్, రాము ముదిరాజ్, వెంకటేష్ ముదిరాజ్, రాజు ముదిరాజ్, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కొత్తూరు చంద్రయ్య, స్వైరో కోడంగల్ డివిజన్ అధ్యక్షుడు కుప్పగిరి సాయిలు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు అన్నారం సాయిలు,మూడనమ్మకాల నిర్మూలన సమితి సభ్యులు జుంటుపల్లి ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటయ్య,జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్, ఎనీకే పల్లి మాజీ ఉపసర్పంచ్ నావిత వెంకటి ముదిరాజ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *