పచ్చిరొట్ట ఎరువులైన జనుము జిలుగు విత్తనాలు అందుబాటులో గలవు

వ్యవసాయ అధికారి రెహనా

పయనించే సూర్యుడు జూన్ 12 ( ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండి మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం డిండి , తాక్లపూర్ నందు పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నది జనుము (40 కేజీల బస్తా) మొత్తం ధర రూ. 6,220 కాగా, 50 శాతం సబ్సిడీ తర్వాత రైతు రూ. 3,110 చెల్లించి పొందవచ్చన్నారు. జీలుగు (30 కేజీల బస్తా) మొత్తం ధర రూ. 4,905 కాగా, 50 శాతం సబ్సిడీ తర్వాత రైతు రూ. 2,452.50 మాత్రమే చెల్లించి విత్తనాలు వినియోగించుకోవచ్చు. అలాగే రెండు ఎకరాల భూమికి సుమారు 30 కిలోల జీలుగు లేదా 30 కిలోల జనుము విత్తనం అవసరం అవుతుంది. కొనుగోలు చేయదలచిన రైతులు పాస్‌బుక్ జిరాక్స్ ప్రతితో పీఎసీఎస్ కేంద్రాన్ని సంప్రదించి విత్తనాలు పొందవచ్చు. అవసరం ఉన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *