పయనించే సూర్యుడు, కోరుట్ల జూన్ 12. కోరుట్ల పట్టణంలోని పి.యం శ్రీ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో కాంప్లెక్స్ పరిధిలోని ప్రాథమిక,ప్రాథమికోన్నత, ఉన్నత,మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, ప్రధానోపాధ్యాయులకు మధ్యాహ్న భోజన సహాయకులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గంగుల నరేశం మాట్లాడుతూ ప్రతి పాఠశాల పరిసరాలు,వంట పాత్రలు ,త్రాగునీరు, వంట సామాగ్రి శుభ్రంగా ఉండాలని వేడిగా ఉన్న పౌష్టికార ఆహారాన్ని విద్యార్ధులకు అందించాలని,రోజు వారీ మెనూ తప్పకుండా పాటించాలని చెప్పారు. మాధ్యహ్నభోజన సహాయకులు విధిగా గ్లౌజులు ధరించాలని, చేతులను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వి.గంగాధర్, మార్గం రాజేంద్రప్రసాద్, నర్సింహామూర్తి సి.ఆర్.పి లు పి.గంగాధర్, జ్యోతి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.