పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 12 సాలూర : తెలంగాణ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ గా నియమితులైన సాలూర వాసి అల్లె లావణ్య రమేష్ గురువారం యూనివర్సిటీలో యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ యాదగిరి రావు యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరిని మర్యాదపూర్వకంగా కలిశారు ఆమె నూతనంగా నియమితులైన సందర్భంగా వైస్ ఛాన్స్ లర్ మరియు రిజిస్ట్రార్ శాలువాతో సన్మానించి మొక్కను అందజేశారు.యూనివర్సిటీ అభివృద్ధి విద్యార్థుల సంక్షేమం మరియు విద్యా ప్రమాణాల మెరుగుదల వంటి పలు అంశాలపై చర్చించినట్లు తెలంగాణ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ తెలిపారు ఈ బాధ్యతలు విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షిస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అల్లె రమేష్ ఉన్నారు.