పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 12 బోధన్ :బోధన్ పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల పాత భవనంలో కొనసాగుతున్న మధమలంచ జూనియర్ కళాశాలకు సొంత భవనం నిర్మించాలని బోధన్ విద్యార్థి సంఘ జేఏసీ ఆధ్వర్యంలో బోధన్ ఆర్డీవో విజయ కుమారి కి వినతిపత్రం అందజేశారు జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన బోధన్ మదమలాంచ జూనియర్ కళాశాలకు సొంత భవనం లేక శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ జూనియర్ కళాశాల పాత భవనంలో కొనసాగుతుందని వెంటనే ప్రత్యేకంగా మదమలంచా జూనియర్ కళాశాలకు సొంత భవనం నిర్మించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు పేద విద్యార్థులు చదువుకుంటున్న కళాశాలకు ప్రభుత్వం వెంటనే ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి నిర్మించాలని కోరారు అదేవిధంగా బోధన్ లో ఎస్టీ బాలుర కళాశాల హాస్టల్ లేదని వెంటనే సాంక్షన్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాల ను చేపడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు డి నాగరాజు టి సంజయ్ శ్రీకాంత్ గౌతమ్ రాజన్న తదితరులు పాల్గొన్నారు