పయనించే సూర్యుడు, జూన్ 12 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ 12 సంవత్సరాల మోదీ గారి పాలన విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం ధ్యేయంగా, వికసిత్ భారత్ లక్ష్యంగా అడుగులు ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలతో,సంస్క రణలతో,అభివృద్ధి పనులతో,వ్యాపార, విద్య, ఉపాధి , వ్యవసాయ ఇలా అన్ని రంగాలకు ,అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిన ఘనత బిజెపి కేంద్ర ప్రభుత్వానిది,మన ప్రధాని నరేంద్ర మోదీ గారిదని కొనియాడిన…బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ మన ప్రియతమ ప్రధాని మోదీ సుసంప న్న పాలన 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శేరిలింగం పల్లి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లో హఫీజ్ పేట్ బి.ఎల్. వై హోమ్స్ వద్ద నిర్వహించిన పాత్రికేయ మీడియా మిత్రులతో నిర్వ హించిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12 సంవత్సరాల మోదీ పాలన విశ్వాసం – అభివృద్ధి – ప్రజా సంక్షేమం ధ్యేయంగా 4,399 రోజులు, 1,05,576 గంటలు వికసిత్ భారత్ వైపు లక్ష్యంగా పనిచే శా రన్నారు, తెలంగాణ నుండి 2014 నుండి టాక్స్ ల రూపంలో 1,18 వేల కోట్లు కేంద్ర ప్రభు త్వానికి వెళ్లగా 1కోట్లు 80 శాతం తిరిగి తెలంగాణ రాష్ట్ర నీ గ్రాంట్లు రూపంలో ఇవ్వడం జరిగింద న్నారు,కాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో వడ్డీ లేకుండా ఇప్పటివరకు 9502 కోట్లు, తెలంగాణ రైతులకు పసుపు బోర్డు, రైల్వే బడ్జెట్ 258 కోట్లు ఉంటే ఇప్పుడు 5336 కోట్లు కేటాయించారని , అమృత్ స్టేషన్లు గా 40 రైల్వే స్టేషన్ లు అభివృద్ధి, 1719 కిలోమీటర్ల జాతీయ రహదారు లు, 38,927 కోట్లతో అభివృద్ధి, 62000 వేల కోట్లతో పలు అభివృధి పనులకు శంకుస్థాపనలు చేశారన్నారు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినవే అని గుర్తు చేశారు ,ఇవి కాక దేశ వ్యాప్తంగా పీఎం కిసాన్ ద్వారా 11 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో రూ. 4.3 లక్షల కోట్లకు పైగా నేరుగా జమ చేశారన్నారు,ఆహార ధాన్యాల ఉత్పత్తి 71 శాతం పెరిగి 12,000 లక్షల మెట్రిక్ టన్నులు పెరిగింది, పాల ఉత్పత్తి 146 మిలి యన్ టన్నుల నుంచి 247 మిలియన్ టన్నులకు పెరుగుదల,కోవిడ్ సమయం లో 99 దేశాలకు వ్యాక్సిన్లు పంపిణీ, జీ-20 సదస్సును విజయవం తంగా నిర్వహణ,గత 12 ఏళ్లలో రూ.70 లక్షల కోట్లకు పైగా విదేశీ పెట్టుబడులు తెచ్చిన ఘనత మోదీది, సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా దేశ భద్రతపై రాజీపడని పోరా టం, స్వచ్ఛ భారత్ తో శుభ్రత,ఫి ట్ ఇండియా తో ఆరోగ్యం పై అవగాహ న ,వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహం, 4 లక్షల కిలోమీటర్లు గ్రామీణ రహదారుల నిర్మాణం,జా తీయ రహదారులు 91 వేల నుండి 1.46 లక్షల కిలోమీటర్లకు పెరిగింద ని,రోజుకు 34 కిలోమీటర్ల రహదా రులు నిర్మా ణం,చీనాబ్ బ్రిడ్జ్, అటల్ టన్నెల్,పంబన్ బ్రిడ్జ్ వంటి అద్భుత ప్రాజెక్టులు,164 కి పై వందే భారత్ రైళ్లు ,విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 164కు పెరుగుదల,స్టా ర్టప్ ఇండియా ద్వారా 2.06 లక్షల స్టార్టప్స్, 120 యూనికార్న్లుయూపీఐ, డిజిటల్ లావాదేవీలు 12,000 రెట్లు పెరుగు దల,మౌలిక సదుపాయాల వ్యయం రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.12.2 లక్షల కోట్లకు, ఈ 12 ఏళ్లలో దేశం మారింది. ప్రపంచంలో భారత్ గౌరవం పెరిగింది. రైతు, పేద, మహిళ, యువత జీవితాల్లో మార్పు వచ్చింది, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలతో, సంస్కరణలతో, అభివృద్ధి చేస్తున్న ఘనత బిజెపి కేంద్ర ప్రభుత్వా నిది, మోదీ గారిది,.తెలంగాణలో కూడా అదే అభివృద్ధి వేగం రావాలంటే డబుల్ ఇంజిన్ రావాలన్నారు, 2047 వికసిత్ భారత్ లక్ష్యంలో తెలంగాణ ముందువ రుసలో ఉండాలని కోరుకుంటున్నానన్నా రు,ఈ కార్యక్రమంలో బల్దా అశోక్, రవీం దర్ రావు, ప్రభాకర్ యాదవ్ రాఘవేంద్ర రావు,బుచ్చిరెడ్డి,అనిల్ గౌడ్, అజిత్ కుమార్, మహేష్ యాదవ్, జితేందర్, పద్మ, సింధు రెడ్డి ,కాంచన కృష్ణ, దుర్గా ప్రసాద్, మొదలగు వారు పాల్గొన్నారు.