11గంటల,10 నిమిషాలు అయినా తెరుచుకొని ఎమ్మార్వో ఆఫీస్ తాళాలు

పడిగాపులు కాస్తున్న ప్రజలు

పయనిచే సూర్యుడు జూన్ 13 ఆదోనిడివిజన్ ప్రతినిధి గుమ్మల బాలస్వామి సొంత పనిలో పడి ఆఫీసును మరిచిపోయిన రెవిన్యూ సిబ్బంది 11 గంటల,10 నిమిషాలు అయినా తెరుచుకొని ఎమ్మార్వో ఆఫీస్ తాళాలు, ఆదోని తాసిల్దార్ ఆఫీస్ సమయపాలన పాటించకుండా ప్రజలకు చాలా ఇబ్బందులు కలిగిస్తున్నారు ఎందుకంటే కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి అందుకోసం పెన్షన్లు అప్లై చేసుకునేందుకు అర్హత కలిగిన సభ్యులు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి అలిసిపోతున్నారు, మరోపక్క వేసవి సెలవులు ముగించుకొని మళ్లీ స్కూల్ కాలేజీలు తేర్చుకుంటున్నాయి ఈ సందర్భంగా కొత్తగా స్కూలుకు కాలేజీలకు జాయిన్ అయ్యే స్టూడెంట్లు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇన్కమ్ సర్టిఫికెట్లు కోసం విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఎమ్మార్వో వీఆర్వోల చుట్టూ తిరిగిన పని కావటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు మరియు వృద్ధులు వితంతువులు మా పని వదులుకొని చాలా ఇబ్బందులకు గురవుతున్నామని వాపోతున్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన సంక్షేమ పథకాలు ముగిసే వరకు ఎమ్మార్వో ఆర్ఐ వీఆర్వోలు అందుబాటులో ఉండి ప్రజలను ఆఫీసుల చుట్టూ తిరగనియ్యకుండా ఎమ్మార్వో ఆఫీస్ కు వచ్చే ప్రతి ఒక్కరికి పని చేసి పంపించాలని వృద్ధులు వితంతువులు వికలాంగులు మరియు విద్యార్థి తల్లిదండ్రులు వాపోయారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *