కూటమి పాలనపై ప్రజా వ్యతిరేకత

* దద్దరిల్లిన కదం తొక్కిన జన సునామి జనసంద్రంగా జగ్గయ్యపేట * వెన్నుపోటుకు రెండేళ్లు – కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై భారీ నిరసన ర్యాలీ * చెప్పడమే బాబు నైజం చేయటం బాబు నైజం కాదు * అప్పులకు, అరాచకాలకు, అవినీతికి నిలియంగా ఆంధ్రప్రదేశ్ * జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు _

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా/జగ్గయ్యపేట నియోజకవర్గం జూన్.13-06-2026 శుక్రవారం జగయ్యపేట్ట పట్టణంలోని ఈరోజు న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన ప్రభుత్వ వైఖరికి నిరసనగా జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కోదాడ రోడ్ లోని వైయస్సార్ విగ్రహం, బస్టాండ్ సెంటర్, నెహ్రూ చౌక్, కన్యాకుమారి పాన్ షాప్, పొట్టి శ్రీరాములు విగ్రహం, సాయిబాబా గుడి, ఫైర్ స్టేషన్, తాసిల్దార్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు , జగ్గయ్యపేట నియోజకవర్గ పరిశీలికలు ఆళ్ల చల్లారావు , రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ మరియు వైసిపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం రెండేళ్లు గడిచినా వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మహిళలు, యువత, రైతులు, నిరుద్యోగులు, వృద్ధులు సహా అన్ని వర్గాల ప్రజలను అబద్ధపు హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడంతో పాటు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. జగ్గయ్యపేటలో టి.టి.డి కళ్యాణ మండపం ప్రారంభమైతే సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో శుభకార్యాలు నిర్వహించుకునే అవకాశం లభిస్తుందని, అలాగే హైవే బస్టాండ్ వినియోగంలోకి వస్తే ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుతాయని పేర్కొన్నారు. అయితే ఈ రెండు పనులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై స్థానిక శాసనసభ్యుడుకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే టి.టి.డి కళ్యాణ మండపం, హైవే బస్టాండ్‌ను ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని, డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన మెగా డీఎస్సీ వాస్తవానికి నిరుద్యోగ యువతకు “దగా డీఎస్సీ”గా మారింది మెగా డీఎస్సీ పేరుతో ప్రచారం చేసుకుంటూ యువతను మభ్యపెట్టడం సరికాదని, రాష్ట్రంలోని అన్ని ఖాళీలను గుర్తించి వెంటనే పూర్తి స్థాయి డీఎస్సీ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, యువత ఆవేదనకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రెండేళ్లుగా కాలయాపన చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. వైఎస్ఆర్ సీపీ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను నిలిపివేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ సీపీ నిరంతరం పోరాడుతుందని, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామాల నాయకులు , మహిళలు, కార్యకర్తలు, భారీ ఎత్తుగా పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *