రాయపల్లిలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం: లైఫ్ ఫౌండేషన్ సహకారంతో 50% సబ్సిడీతో 10 కుట్టు మిషన్ల పంపిణీ

మహిళల స్వయం ఉపాధికే ప్రాధాన్యం: రాయపల్లి సర్పంచ్ కిష్టారం గాయత్రి మల్లేష్ గౌడ్

పయనించే సూర్యుడు జూలై 04 మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలనే ఉద్దేశ్యంతో రాజాపూర్ మండలం రాయపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ కిష్టారం గాయత్రి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో, ‘లైఫ్ ఫౌండేషన్’ సహకారంతో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న మహిళలకు లైఫ్ ఫౌండేషన్ మహబూబ్ నగర్ జిల్లా మేనేజర్ సి.పి. శివలీల సహకారంతో, సర్పంచ్ చేతుల మీదుగా 50% సబ్సిడీపై 10 కుట్టు మిషన్లను అందజేశారు. మహిళలు ఇటువంటి సువర్ణ అవకాశాలను సద్వినియోగం చేసుకొని సొంతంగా ఉపాధి పొందాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కుట్టు శిక్షకురాలు కావలి రాజేశ్వరి, గ్రామ సెక్రెటరీ సుదర్శన్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ మల్లేష్ గౌడ్, గ్రామ ప్రజాప్రతినిధులు, స్థానిక మహిళలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *