పయనించే సూర్యుడు న్యూస్ 13 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండల్ ఇబ్రహీంపూర్ గ్రామంలో.ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజన్ ఎన్జీఓ ఆధ్వర్యంలో ఇబ్రహీంపూర్ గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పిల్లల హక్కుల పరిరక్షణ, విద్య యొక్క ప్రాముఖ్యతపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విజన్ ఎన్జీఓ జిల్లా కోఆర్డినేటర్ రాజు మాట్లాడుతూ, బాల కార్మిక వ్యవస్థ సమాజ అభివృద్ధికి అడ్డంకిగా మారుతుందని, ప్రతి బాలుడు విద్యను అభ్యసించే హక్కు కలిగి ఉన్నాడని పేర్కొన్నారు. సి.ఎస్.ఎం యాదగిరి, సంజీవ్ బాలల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి మాధవి మాట్లాడుతూ, బాల కార్మికులను గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. గ్రామ ఉప సర్పంచ్ చౌదరి శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో.విజన్. ఎన్జీవో డిస్ట్రిక్ట్.కో . ఆర్డినేటర్ కె.రాజు, గ్రామ సర్పంచ్ జ్యోతి, ఉప సర్పంచ్. సిహెచ్ . శ్రీనివాస్, గ్రామకార్యదర్శి మాధవి మరియు.విజన్.సిబ్బంది సంజీవ్, యాదగిరి వార్డు సభ్యులు రాజు,నవీన్,రమ్య రాజు.అంగన్వాడీ టీచర్స్ బుజమ్మ, బాలక్ష్మి, ఆశ వర్కర్ రాజవ్వ, స్కూల్ టీచర్ సయ్యద్,పెద్దలు, యువకులు, మహిళలు, విద్యార్థులు మరియు స్థానిక గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.