కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉమ్రీ సర్పంచ్ వార్డు సభ్యులు

కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

పయనించే సూర్యుడు జూన్ 13 ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్ ఉట్నూర్ ప్రతినిధి: ఉట్నూర్ మండలం ఉమ్రి సర్పంచ్ వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన నిర్మల్ డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన ఎమ్మెల్యే గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అధికారా పార్టీతోనే గ్రామ అబివృద్ధి సాధ్యం అని అన్నారు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఎమ్మెల్యే చేస్తున్న అబివృద్దికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నాం అని సర్పంచ్ అన్నారు కాంగ్రెస్ పార్టీ పిలుపిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించిన వెడ్మ బొజ్జు పటేల్ పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడం ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అన్నారు టెంకాయ కొట్టి,రిబ్బన్ కట్ చేసిన ఎమ్మెల్యే లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్,వార్డ్ సభ్యులు,గ్రామస్తులు,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు,మండల నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *