పయనించే సూర్యుడు మే 21 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన శంషుద్దీన్ గారిని బుధవారం బీసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బిజినపల్లి మండల బీసీ ఉపాధ్యక్షుడు అబ్బ కరుణాకర్, బీసీ సంఘం గ్రామ అధ్యక్షుడు పద్మ శ్రీశైలం, గ్రామ కుమ్మరి సంఘం అధ్యక్షులు కుమ్మరి శ్రీశైలం కలిసి ఎస్సైని సన్మానించి అభినందనలు తెలియజేశారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.