పయనించే సూర్యుడు-30-05-2026-రాజంపేట న్యూస్ : కూటమి ప్రభుత్వం భర్తీ చేసిన 2025 మెగా డీఎస్సీ విజయవంతం అవ్వడాన్ని వైసీపీ పార్టీ జీర్ణించుకోలేక పోతుందని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్ తెలిపారు. శుక్రవారం ఆయన రాజంపేటలో పాత్రికేయులతో మాట్లాడుతూ వాస్తవానికి వైసీపీ పాలనలోనే నిరుద్యోగులను మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ పేరుతో మెగా మోసం జరిగిందని, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన మొదటి సంతకం హామీ నెరవేర్చి నిరుద్యోగులకు అండగా ఉంటే డీఎస్సీ లో అక్రమాలు అంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. వందల సంఖ్యలో కోర్టులో అక్రమ కేసులు వేసి డీఎస్సీ ని ఆపాలనే ప్రయత్నం చేశారన్నారు. వైసీపీ ని నిరుద్యోగులు ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదని, నిబంధనల ప్రకారం మెరిట్ ఆధారంగానే డీఎస్సీ నియామకం జరిగిందని, చంద్రబాబు అంటేనే నిజాయితీగా ఉద్యోగాల భర్తీ చేస్తారన్న బ్రాండ్ ఉందని, ఇలాగే వైసీపీ పార్టీ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే రోడ్లపై నిరగనివ్వమని షేక్ సిద్ధిక్ వైసీపీ పార్టీని హెచ్చరించారు.