పయనించే సూర్యుడు-30-05-2026-రాజంపేట న్యూస్ : ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు. శుక్రవారం స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయం నందు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించి ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని, ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. భూ సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన, పెన్షన్లు, డ్రైనేజీ, ,రోడ్డు నిర్మాణం వంటి సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.