కోదుమూరు-2 అంగన్వాడీ కేంద్రంలో తల్లుల సమావేశం నిర్వహణ

పయనించే సూర్యుడు మే 30, ( చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు) చింతకాని మండలంలోని కొదుమూరు గ్రామంలో ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా చింతకాని మండల పరిధిలోని కోదుమూరు-2 అంగన్వాడీ కేంద్రంలో తల్లుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీడీపీఓ శ్రీమతి సిహెచ్. కమలప్రియ హాజరై మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ మొదటి 1000 రోజుల ప్రాముఖ్యత, తల్లి-పిల్లల పోషణ, పరిశుభ్రత, బాల్యారంభ అభివృద్ధిలో కుటుంబ సభ్యుల పాత్ర, అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి తల్లులకు అవగాహన కల్పించారు. అనంతరం తల్లులు, చిన్నారులకు పోషకాహారం పంపిణీ చేసి గర్భిణీల గృహాలను సందర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప సర్పంచ్ సిహెచ్. రాంబాబు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పోషకాహారం, ప్రీ-స్కూల్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. హెల్త్ సూపర్వైజర్ శ్రీమతి రేచల్ రాణి మాట్లాడుతూ ఇమ్మ్యూనైజేషన్, గర్భిణీలకు అందిస్తున్న ఆరోగ్య సేవలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీమతి టి. విజయలక్ష్మి, ఏఎన్‌ఎం పద్మావతి, అంగన్వాడీ టీచర్ గౌసియా బేగం, ఆశా కార్యకర్తలు వరమ్మ, రేణుక, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *