బోనకల్లో ఐదవ రోజుకు చేరిన వివోఏల నిరవధిక సమ్మె

పయనించే సూర్యుడు మే 30, (చింతకాని మండలం రిపోర్టర్). బోనకల్ : సమస్యల పరిష్కారం కోసం ఐకేపీ వివోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం ఐదవ రోజుకు చేరుకుంది. మండల ఎమ్మార్వో కార్యాలయం ఎదుట నిర్వహించిన ఈ సమ్మెలో బోనకల్ మండలానికి చెందిన వివోఏలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల వివోఏ సంఘం అధ్యక్షురాలు బోయినపల్లి దివ్య మాట్లాడుతూ, నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అందుతున్న స్వల్ప వేతనాలతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వివోఏలకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని, అర్హులైన వివోఏలకు సీసీలుగా పదోన్నతులు కల్పించాలని, సాధారణ మరియు ఆరోగ్య భీమా సౌకర్యాన్ని రూ.20 లక్షల వరకు పెంచాలని, 58వ జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం కొట్టే వెంకటేశ్వర్లు, సీసీలు నాగమణి, శిరోమణి, వెంకట్‌రావమ్మ, అకౌంటెంట్ రత్నకుమారి, కంప్యూటర్ ఆపరేటర్ రవి, హెచ్‌సీసీ సీఈవో సాయి, వివోఏ సంఘం ఉపాధ్యక్షులు మీరాబి, కార్యదర్శి దారెల్లి దివ్య, కోశాధికారి ఉష, సహాయ కార్యదర్శి ప్రమీలతో పాటు వివోఏ సంఘం సభ్యులు సజ్జన, కృష్ణవేణి, శ్రావణి, శాంతి, రమాదేవి, పైడిపల్లి కృష్ణ, బలగాని నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *