పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే 22.052026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ// ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు తయారీ చేసి రైతులకు అందిస్తున్న బయో ఉత్పత్తుల కేంద్రాన్ని బి ఆర్ సి సందర్శించి అక్కడ రైతులకు అందుబాటులో వున్న ఉత్పత్తులను గురించి కేంద్రం యజమాని అయిన వరాల్ రెడ్డి ని అడిగి తెలుసుకున్నారు.పి యం డి యస్ విత్తనాలు వేసిన పొలాన్ని సందర్శించారు. తరువాత రైతులను ఉద్దేసించి మాట్లాడుతూ ఈ ఏడాది ఋతుపవనాల సమయంలో ఎల్ నినో పరిస్థితుల ప్రభావం వలన వర్షపాతం లోటు ఉంటుందని, ఈ ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ఋతుపవన సమయంలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పి ఎం డి ఎస్) విధానంలో మరియు గుళికల పద్ధతిలో విత్తనాలు నాటి, సాగును ముమ్మరం చేయాలని సూచించారు. ఇందుకోసం వర్షాభావ ప్రాంతాల్లో 15 కిలోల బరువు వుండే 25-30 రకాల విత్తనాల కిట్లను రైతులకు బి.ఆర్.సి సెంటర్ ద్వారా సరఫరా చేస్తున్నామని రైతులకు తెలియజేశారు. ఈ వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఈ పి. యం. డి. యస్ కిట్ల లోని విత్తనాలను తమ భూమిలో వేసుకోవాలని తెలియజేశారు. ఈ పి. యం డి. యస్ కిట్ల కొరకు సంప్రదించవలసిన చిరునామా (బయో రిసోర్స్ సెంటర్ ) సెంటర్ వరాల్ రెడ్డి – 8179886828 కోటగుండ్లపల్లి తమ్మి నాయన పల్లి సోమల మండలం ఈ బయో సెంటర్ నందు ప్రకృతి వ్యవసాయం కు సంబంధించిన అన్నిరకాల కషాయాలు, వేపనూనె, వేపపిండి, జిగురు అట్టలు, లింగాకర్షక బుట్టలు కూడా అందుబాటులో వున్నవి. ఈ కార్యక్రమంలో పుంగనూరు సహాయ వ్యవసాయ సంచాలకులు శివకుమార్ గ,ఏవో సుధాకర్, రైతు సేవ కేంద్రం సిబ్బంది మనోజ్, లలిత, ఏ పి సి ఎన్ ఎఫ్ ఎఫ్ ఎం టిలు భువనేశ్వరి, రవీంద్రారెడ్డి మరియు సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. వై.సుధాకర్ వ్యవసాయ అధికారి సోమల