గోపాలపేటలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు …

* - జండా ఆవిష్కరించిన ఉప సర్పంచ్ శనక్కాయల సత్యనారాయణ. * కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నాయకులు, గ్రామ ప్రజలు ..

పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ 3,తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో ఆ గ్రామ ఉప సర్పంచ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు శనక్కాయల సత్యనారాయణ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జండా ఆవిష్కరించిన అనంతరం ఉప సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ స్వరాష్ట్ర ఏర్పాటుకై ఎందరో మహానుభావులు తమ ధనాన్ని,మేధస్సుని, సమయాన్ని హెచ్చించి 60 ఏళ్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కలను తెలంగాణ జాతిపిత,రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో సాకారం చేసుకున్నామని.ఇలా ఎందరో మహానుభావుల ఆశయాలతో,త్యాగాలతో సాధించిన తెలంగాణ రాష్ట్రం. వారి ఆశయాలకనుగుణంగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధిని మరింత ముందుకు కొనసాగించే దిశగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈజీఎస్ కూలీలకు భోజనం ఏర్పాటు చేయించారు. ఇటువంటి మహత్తరమైన రోజున నిరుపేదలను గుర్తించి వారికి సహాయ సహ కారాలు అందిస్తే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో భాగస్వాములైన మహానుభావుల ఆశయాలను మనం కొంతమేర నెరవేర్చిన వారమవుతామని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొమ్మినేని శ్రీనివాసరావు, సండ్ర యువసేన నాయకులు, బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ అధ్యక్షులు, యువజన పార్టీ కార్యకర్తలు,గ్రామ ప్రజలు,ఈజీఎస్ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *