పి. గన్నవరం మండలంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్ )అవగాహన సదస్సు

పయ నించే సూర్యుడు జూన్ 8 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) పి. గన్నవరం, జూన్ 6: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై మండల స్థాయి అవగాహన సదస్సు శనివారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశానికి పి. గన్నవరం మండల తహసీల్దార్ శ్రీమతి పి. పల్లవి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డివిజనల్ లెవల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎస్.టి.వి రాజేశ్వరరావు ( డి ఏ డి ఓ ) బూత్ లెవల్ అధికారుల (బి ఎల్ ఓ ు) పనితీరును సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జూన్ 15 నుంచి జూలై 14 వరకు నిర్వహించనున్న ఇంటింటి ఓటర్ల సర్వేను అత్యంత బాధ్యతాయుతంగా చేపట్టాలని సూచించారు. ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని, మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలను నిబంధనల ప్రకారం గుర్తించి సవరణలు చేపట్టాలని తెలిపారు. ఓటర్ల జాబితా స్వచ్ఛత, పారదర్శకత, ఖచ్చితత్వం కోసం ఈ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సర్వే సమయంలో ప్రజలకు అవసరమైన అవగాహన కల్పిస్తూ, వారి నుంచి సరైన సమాచారం సేకరించాలని బి ఎల్ వో లకు సూచించారు. ప్రజలు కూడా సర్వేకు సహకరించి తమ వివరాలను సరిచూసుకుని అవసరమైన మార్పులు, చేర్పులు చేయించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వి. డాంగే, మండల ఎన్నికల విభాగం సీనియర్ అసిస్టెంట్ సకిలే స్వామీజీరావు, కంప్యూటర్ ఆపరేటర్ ఎం. జరీనా జైనబ్ పాల్గొన్నారు. అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులుగా బీజేపీ సీనియర్ నాయకులు చెరుకూరి గోపాలకృష్ణ , బిజెపి జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి కటికిరెడ్డి తమ్మయ్య నాయుడు గారు, బిజెపి సీనియర్ నాయకులు అయ్యా, కృష్ణసుందర్ , టీడీపీ, జనసేన తదితర రాజకీయ పార్టీల నాయకులు హాజరై ఈ కార్యక్రమంలో నేను చీకరమెల్లి శ్రీనివాసరావు మాజీ సర్పంచ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బిజెపి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాల్గొన్నను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *