నాచేపల్లి లో క్రీడా మైదానాన్ని ప్రారంభించిన తుంబూరు దయాకర్ రెడ్డి

పయనించే సూర్యుడు.. న్యూస్..9 నేలకొండపల్లి మండలం నాచేపల్లి లో చైతన్య ఫౌండేషన్ వారి సహకారంతో పాటు గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న క్రీడా మైదానాన్ని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ,సమాచార శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ఇంఛార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ప్రారంభించారు.ఏ5సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఆటస్థలం ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారుక్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని ఆయన తెలిపారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా చదువుతో పాటు ఆటలపై దృష్టి సాధించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేలకొండపల్లి మండల అధ్యక్షుడు కొడాలి గోవిందరావు,మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు,సర్పంచ్ భూక్యా మౌనిక ఉప సర్పంచ్ ముండ్ర నాగప్రసాద్, నాయకులు నెల్లూరి భద్రయ్య, నల్లాని మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.t

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *