పయనించే సూర్యుడు జూన్ 16 (గణేష్ టౌన్ రిపోర్టర్ వేములవాడ : తిప్పాపురంలో బోరుబావి పూజా కార్యక్రమం. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ నిధుల నుండి మంజూరు చేయబడిన బోరు బావికి బిజెపి పట్టణ అధ్యక్షులు రాపెళ్లి శ్రీధర్ కౌన్సిలర్ మైలారం శ్రీనివాస్ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడలోని నీటి ఎద్దడిని ఎంపీ దృష్టికి తీసుకుపోయిన వెంటనే పట్టణం లో 8 బోర్లు వేయిoచడానికి ఆదేశాలు జారీచేసి వెంటనే బోర్ బండి పంపించడం జరిగింది అన్నారు ఈ వారం రోజుల్లో ఈ 8 బోర్లకు మోటార్లు కూడా బిగించి ప్రజలకు అందుబాటులకు తీసుకువస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి వివేక్ రెడ్డి నేరెళ్ల సాయి జగన్నాథo శ్రీనివాస్ కిరణ్ మొక్సిత్ శివ సాయి మల్లేశం 7వ మరియు 8వ వార్డు ప్రజలు పాల్గొన్నారు