కాకతీయ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో డాక్టర్ రఘుపతి శిష్యులు

పయనించే సూర్యుడు తేదీ: 16-06-2026 (మల్కాజిగిరి ఇన్‌చార్జ్: డాక్టర్ రఘుపతి ): కాకతీయుల కాలం నాటి కళలు, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడం మరియు వాటిని పరిరక్షించడం మన అందరి బాధ్యత అని ఇనుగాల వెంకట్రామిరెడ్డి అన్నాడు . తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియు పర్యాటక శాఖ సౌజన్యంతో ఆదివారం కిలా వరంగల్ మధ్యకోట కుష్ మహల్ మైదానంలో నిర్వహించిన “కాకతీయ మహనుభావుల కళా వైభవం” కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించాడు . ఈ సందర్భంగా కవులు, కళాకారులు, నృత్య గురువులను ప్రోత్సహించేందుకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపాడు . అనంతరం కాకతీయ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు లక్ష్యంగా 501 మంది కళాకారులతో “కాకతీయుల వారసత్వం – మన వైభవం” అనే అంశంపై ఒకే వేదికపై అద్భుతమైన శాస్త్రీయ నృత్య ప్రదర్శన నిర్వహించబడింది. ఈ మహత్తర కార్యక్రమంలో ప్రముఖ నాట్య గురువు డాక్టర్ రఘుపతి గారి శిష్యులు విశేషంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కాకతీయుల వైభవాన్ని ప్రతిబింబించే నృత్య రూపకాలను అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. గురువు మార్గదర్శకత్వంలో శిష్యులు క్రమశిక్షణతో, నృత్య నైపుణ్యంతో ప్రదర్శనలు ఇచ్చి కార్యక్రమ విజయానికి తమ వంతు సహకారం అందించాడు . కళా సంప్రదాయాల పరిరక్షణలో డాక్టర్ రఘుపతి చేస్తున్న సేవలను పలువురు కొనియాడగా, ఆయన శిష్యులు రాష్ట్ర స్థాయిలోనే కాక జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందాలని ఆకాంక్షించాడు . కార్యక్రమం ముగింపులో పాల్గొన్న కళాకారులు, నృత్య గురువులకు ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, ముత్యాల పరమేశ్వర్, నరసింహమూర్తి, దుబ్బ శ్రీనివాసరావు, ఆడెపు రవీందర్, బండ శ్రీనివాస్, అనిత రెడ్డి, రవి యాదవ్,కాంశెట్టి, రాజు పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *